ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఫెయిల్

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఫెయిల్

  • రైతులు కన్నీరు పెడుతున్నారు
  • బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు

కరీంనగర్, ఆంధ్రప్రభ : రైతులు కష్టపడి పండించిన ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో r ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ చేతకానితనం వల్ల అన్నం పెట్టే అన్నదాతలు కన్నీరు పెడుతున్నారన్నారు.

నెలల తరబడి దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉండడం వల్ల రైతులు ధాన్యం కుప్పల వద్ద వడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం సకాలంలో దాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల అకాల వర్షంతో ధాన్యం తడిసిపోతుందని, వెంటనే ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనబడుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెబుతుంటే ఇతర మంత్రులు 40 లక్షల మెట్రిక్ టన్నులని ఒక్కో మంత్రి ఒక్కోమాట చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉండిపోతున్నదన్నారు. వరితో పాటు మొక్కజొన్న 40 రోజులుగా కొనుగోలు కేంద్రంలో ఉండిపోయిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ధాన్యం కొనుగోలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply