పోలీసుల చొరవతో పోయిన మొబైల్ రికవరీ..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని రామచంద్రపురానికి చెందిన సురేందర్ అనే వ్యక్తి తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుని, దానిని రికవరీ చేయాలని చిట్యాల పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు సమర్పించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు చిట్యాల ఎస్సై సతీష్ ఆదేశాలపై పోలీస్ సిబ్బంది ప్రభుత్వ పోర్టల్‌లో మొబైల్ వివరాలను నమోదు చేశారు.

ఈ ప్రక్రియలో కానిస్టేబుల్ లాల్ సింగ్ సాంకేతికంగా నిరంతరం నిఘా ఉంచి, CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్‌ను గుర్తించి రికవరీ చేశారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్‌ను ఎస్సై సతీష్ బాధితుడు సురేందర్‌కు అందజేశారు.