కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో వివాహిత నిమ్మ లావణ్య (34) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు చొప్పదండి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన తిరుపతిని వివాహం చేసుకుంది.
కుటుంబ కలహాల కారణంగా గత రెండు నెలలుగా లావణ్య పుట్టింట్లో ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి భర్తతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
సమాచారం అందుకున్న పెద్దపల్లి రూరల్ ఎస్‌ఐ మధుకర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
