By accident | ఈత సరదా.. విషాదం

By accident | ఈత సరదా.. విషాదం

చెరువులో మునిగిన‌ బాలుడు..

By accident | మునుగోడు, ఆంధ్రప్రభ : ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందిన ఘటన మండలంలోని పులిపలుపుల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కాయితా అఖిల్‌(13) తన స్నేహితుడు గోలి గణేష్‌తో కలిసి గ్రామ శివారులోని చెరువుకు ఈత నేర్చుకోవడానికి వెళ్లాడు.

ఈ క్రమంలో లోతైన నీటిలోకి వెళ్లిన అఖిల్‌కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్థానికులు బయటకు తీసేలోపే మృతి చెందినట్లు తెలిసింది. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇరుగు రవి తెలిపారు.

click here to read more : అంతర్జాతీయ దొంగల ముఠా అరెస్టు

click here to read more

Leave a Reply