కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో చోరీ

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఆస్నాద్ రోడ్ (పంచముఖ హనుమాన్ ఆలయం సమీపంలో) కాంగ్రెస్ నాయకుడు హేమంత్ రెడ్డి ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇంటి యజమాని హేమంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 4న కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి దైవ దర్శనానికి వెళ్లి, గురువారం తిరిగి ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగులగొట్టినట్లు గుర్తించారు.
దొంగలు ఇంటిలోకి ప్రవేశించి రూ.70 వేల నగదు, రెండు కిలోల వెండి సామగ్రిని అపహరించినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
