కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి..

కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి..

  • సర్పంచ్ సుర్వి సౌజన్య రాజుగౌడ్

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అని మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణమని అల్లందేవిచెర్వు గ్రామ సర్పంచ్ సుర్వి సౌజన్య రాజు గౌడ్ గారు అన్నారు. అల్లందేవిచెర్వు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. దేశ మహిళల శక్తి,సామర్థ్యాలను గౌరవిస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు నారీశక్తి వందన్ అభినియం చారిత్రాత్మక సంస్కరణగా నిలిచింది.

మహిళలకు రాజకీయ రంగంలో సముచిత స్థానం కల్పించాలనే నిజమైన సంకల్పంతో తీసుకొచ్చిన ఈ బిల్లును దేశ ప్రజలు, అందులోనూ మహిళలు హర్షిస్తున్నారు.మహిళల హక్కుల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు పరీక్ష వచ్చినప్పుడు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పటికీ మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్, ఇప్పుడు అదే బిల్లును వ్యతిరేకించడం పూర్తిగా ద్వంద్వ వైఖరి. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు బ్యాంకుగానే చూస్తూ కాంగ్రెస్ పార్టీ మహిళలను అవమానిస్తుందని.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు.

Leave a Reply