కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు సొంతింటి కల సాకారం

లబ్ధిదారుడి ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజల సొంతింటి కల నెరవేరుతుందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ 9వ వార్డులో లబ్ధిదారుడు రెడ్డమోని మల్లేష్ యాదవ్‌కు నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ 9వ వార్డు అధ్యక్షుడు మలిగే మల్లేష్, 10వ వార్డు అధ్యక్షుడు పోలోజు శ్రీనివాస చారి, నాయకులు మలిగే నరసింహ, రాపర్తి సైదులు, మలిగే లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.