బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు

  • ​చౌటుప్పల్‌లో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని 12 సంవత్సరాల సుపరిపాలన, విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి విచ్చేసి మొక్కలు నాటారు. ​ఈ సందర్భంగా డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ తమ ఖాళీ స్థలాలలో, వ్యవసాయ భూములలో ‘అమ్మ పేరిట ఒక మొక్క’ను నాటి, దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

నరేంద్ర మోడీ ఈ దేశంలో ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడి, అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ప్రజానేత అని కొనియాడారు. గతంలో నెహ్రూ నామినేటెడ్‌గా వచ్చి పరిపాలించారని గుర్తుచేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలనే సంకల్పంతో అహోరాత్రులు నిరంతరం కృషి చేస్తున్న అలుపెరుగని కారణజన్ముడు మోడీ అని ప్రశంసించారు. దేశంలో గతంలో క్లిష్టమైన, అసాధ్యం అనుకున్న ఎన్నో అంశాలను సుసాధ్యం చేసి అమలు చేసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. ​

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక, రాజకీయ సంక్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే, భారతదేశం మాత్రం సుభిక్షంగా, ప్రశాంతంగా ఉందంటే దానికి నరేంద్ర మోడీ ఇస్తున్న ధీమానే కారణమని, ఈ విషయాన్ని భారత ప్రజలు మరువకూడదని పేర్కొన్నారు. మోడీ సుపరిపాలనకు మద్దతుగా ఈ నెల 21వ తేదీ వరకు నిర్వహించే వివిధ సేవా కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ​

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడెల భిక్షం గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు కడారి కల్పన ఐలయ్య యాదవ్, రూరల్ అధ్యక్షులు కైరంకొండ అశోక్, 2వ వార్డు కౌన్సిలర్ పోలపల్లి లక్ష్మీ ముత్తయ్య, 18వ వార్డు కౌన్సిలర్ బుడ్డ సురేష్, 6వ వార్డు కౌన్సిలర్ ఆలే శ్రీలత చిరంజీవి, పార్టీ జిల్లా నాయకులు రమణగోని శంకరయ్య, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సుపరిపాలన కార్యక్రమాల మున్సిపల్ కన్వీనర్ కడారి ఐలయ్య యాదవ్, రూరల్ కన్వీనర్ యాస అశోక్ రెడ్డి, నాయకులు దిండు భాస్కర్, ఊడుగు వెంకటేశం గౌడ్, పబ్బు వంశీ, వంగాల రమాకాంత్, గుర్రం రవీందర్, వరగంటి భాను, బొల్లమోని శ్రీశైలం, పర్ని శేఖర్ రెడ్డి, కానుగు కొండల్, కానుగు శేఖర్, ఉష్కాగుల నాగరాజు, కాసోజు కనకాచారి, కాసోజు గోపి, తేలుకుంట్ల శ్రీధర్, గౌతమ్, సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్ష, కార్యదర్శులు, 18వ వార్డు ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply