అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన బైక్..
అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన బైక్..
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఆర్కా పూర్ సమీపంలో మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీ కొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. 108 ఈఎంటీ ఆముల శంకర్, పైలట్ బియ్యాల ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారంగా.. మండలంలోని సాలెగూడ నుండి ఉట్నూర్ కు ద్విచక్ర (బైక్ )వాహనంపై టెకం తులసి రామ్, ఆత్రం ఉదయ్ కిరణ్ వస్తుండగా బైకు అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్న సంఘటనలో టెకం తులసి రామ్ (25) అక్కడికక్కడే మృతి చెందాడని, ఉదయ్ కిరణ్ అనే యువకుడికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సమాచారం ఇవ్వగా వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ఉదయ్ కిరణ్ కు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు వారు తెలిపారు. ఉదయ్ కిరణ్ పరిస్థితి కూడా విషమంగా ఉందని ద్విచక్ర వాహనం వేగంగా నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పేర్కొన్నారు.
