Manchirial | గోదావరిలో స్నాన‌మాచరిస్తూ…..

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎర్రాయిపేటలోనూ విషాదం నెలకొంది. గోదావరిలో మునిగి 50 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గోదావరిలో నీటి ప్రవాహం లేనపట్టికీ ఇసుక కోసం జరిగిన తవ్వకాల్లో గుంతలు ఏర్పడ్డాయి. నీటితో నిండిన గుంతల్లో భక్తులు స్నానాలు చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడు పారుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇదే ప్రాంతంలో గతంలో కూడా ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా అధికారులు సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం, ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని బాధితులు అంటున్నారు.. ఇసుక తవ్వకాల వల్ల గల్లంతైన బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply