ప్లాస్టిక్ ప్లేట్లను వాడవద్దు

ప్లాస్టిక్ ప్లేట్లను వాడవద్దు

కడెం, ఆంధ్రప్రభ : ప్లాస్టిక్ ప్లేట్లను వాడవద్దని స్టీల్ ప్లేట్లను వాడుకోవాలని కడెం మండలంలోని లింగాపూర్ గ్రామ సర్పంచ్ కుమ్మరి రంజిత్ కుమార్ అన్నారు. ప్లాస్టిక్ వాడకం మనిషి నిత్యజీవితంలో భాగం అయిపోయింది. అది ప్రమాదకరమని తెలిసినా వినియోగం మాత్రం తగ్గడం లేదు. అందుకు భిన్నంగా కడెం మండలం లింగాపూర్ గ్రామ సర్పంచ్ కుమ్మరి రంజిత్, వినూత్నంగా ఆలోచించి గ్రామంలో ఎలాంటి ఫంక్షన్ జరిగిన ప్లాస్టిక్ ప్లేట్లను వాడకం నిషేధించాలని అన్నారు. అందుకు గ్రామ ప్రజల సహకారంతో సుమారుగా 1000 ప్లేట్లను కొనుగోలు చేసి, గ్రామంలో ఏ ఫంక్షన్ జరిగిన ఉచితంగా గ్రామపంచాయతీ నుండి తీసుకుని వెళ్లి స్టీల్ ప్లేట్లనే ఉపయోగించాలని తీర్మానించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ ని వాడడం వల్ల శ్వాస కోశ సంబంధ వ్యాధులు, రోగ నిరోధక శక్తి బలహీనపడడం, కాలేయం , కిడ్నీ, మెదడు వంటి వ్యాధులు ప్రభలుతాయాని, గ్రామాన్ని పర్యావరణ రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇప్పటి నుంచి గ్రామంలో ఎవరు కూడా ప్లాస్టిక్ ప్లేట్లను వాడకూడదని అన్నారు. ఇందులో గ్రామ ఉపసర్పంచ్ కమ్మల లక్ష్మీ స్వామి, గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు ఉన్నారు.

Leave a Reply