Students | రికార్డు స్థాయి ఉత్తీర్ణత..

Students | రికార్డు స్థాయి ఉత్తీర్ణత..

Students | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం ఉదయం ఫలితాలను ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్ వచ్చింది. కాసేపటి క్రితం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు.

పరీక్షలు రాసిన 10 లక్షల మందికి పైగా విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఫలితాల్లో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదైంది. గత 12 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని విద్యార్థులు సాధించినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం విశేషంగా నిలిచింది.

 ఫలితాలను https://resultsbie.ap.gov.in, www.eenadu.net, www.eenadupratibha.netలో ఫలితాలు పొందవచ్చు. మనమిత్ర వాట్సప్‌ నం.9552300009 ద్వారా ఫలితాలు చూసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. 

Leave a Reply