సాకరమైన పేదల దశాబ్దాల కల…

సాకరమైన పేదల దశాబ్దాల కల…

పేదలకు పొజిషన్ సర్టిఫికెట్లు అందజేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదేశాలతో పేదల దశాబ్దాల కల సాకారమైంది. మైలవరం మండలంలోని పోరాట నగర్లో పేదలు దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. వారి స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్లు లేవు. దీనివల్ల వారు ప్రభుత్వం నుంచి మంజూరు అయ్యే పక్కాగృహాలు మంజూరు కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు దృష్టికి తీసుకువచ్చారు.

పేదలకు తక్షణమే పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఆదేశించారు. దీనిపై రెవిన్యూ అధికారులు పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయగా వాటిని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పోరాట నగర్లో మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. దీంతో పేదలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.

దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్య ఇప్పుడు పరిష్కారమైందని పేదలు పేర్కొన్నారు. మొత్తం 60 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు అందజేశారు. వీరికి త్వరలోనే పక్కాగృహాలు కూడా మంజూరు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) , తదితరులు పాల్గొన్నారు.