రైతన్నా మీకోసం.. రైతుల్లో అవగాహన…

రైతన్నా మీకోసం.. రైతుల్లో అవగాహన…
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 16వ తేదీ నుండి 21 తేదీ వరకు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రతి రైతు సేవ కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఉరవకొండ వ్యవసాయ సహాయ సంచాలకులు సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో పంచ సూత్రాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ సాయం అంశాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎల్ నీనో ప్రభావం వల్ల తూర్పు పసిఫిక్ మహాస ముద్రంలో ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడం ద్వారా వర్గీకరించబడిన వాతావరణ పరిస్థితులు. దీని ప్రభావం ద్వారా భారత దేశం లో 2026 సంవత్సరంలో వెచ్చని వేసవి మరియు అస్థిర ఋతుపవన వర్షాలకు ముప్పు కలిగించే ఎల్ నినో పరిస్థితుల సంభావ్యత 50 నుంచి 70 శాతం సూచిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పాదకతను తగ్గిస్తుంది పెద్ద శాశ్వత నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. అన్న అంశంపై రైతులకు సమాచారాన్ని చేరవేర్చడం.
ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో విత్తన గుళికలు/ విత్తన బంతులు ( పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్స్), మల్టీ క్రాపింగ్ మోడల్స్, ఏటీఎం మోడల్స్, డ్రాటు ప్రూఫ్ మోడల్స్ వంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో, ప్రస్తుత వర్షాధార బీడు భూములు, వర్షాధార ఎర్ర నేలలు, నీటి వసతి గల భూములలో, పండ్ల తోటలలో వంటి ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులు పాటిస్తూ ముందస్తు చర్యలు చేపట్టడం మారుతున్న పరిస్థితులకు ఎంతో అనుగుణం. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కలిగించే ప్రతికూల పరిణామాలను అనగా వివిధ పంటలఫై ఎగుమతులు, వివిధ రకాల ఎరువుల దిగుమతులపై రైతుల్లో అవగాహనను పెంచడం, సరైన సమాచారం రైతులకు సమాచారం అందించడం.
ఈ కార్యక్రమం లో ఫార్మర్ యాప్, ఫార్మర్ రిజిస్ట్రీ ఇంకా చేసుకొని రైతులకు ఈ ఆవశ్యకతను తెలియజేయడం, ప్రతిరోజు 90 నుంచి 120 గృహాలను సందర్శించి వ్యవసాయ అనుబంధ రంగాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై రైతుల్లో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖతోపాటు అనుబంధ శాఖ అధికారులు పాల్గొంటారని తెలిపారు.
