AP | రామస్వామి జయంతి వేడుకలు..

AP | రామస్వామి జయంతి వేడుకలు..

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రముఖ సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, మానవతామూర్తి త్రిపురానేని రామస్వామి జయంతి కార్యక్రమం గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డీఆర్డీఏ పీడీ నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ ముఖ్య అతిథిగా పాల్గొని త్రిపురానేని రామస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆర్డీఓ సువర్ణ మాట్లాడుతూ.. సమాజ సంస్కరణ, స్వాతంత్ర్య ఉద్యమం, అణగారిన వర్గాల అభ్యున్నతికి త్రిపురనేని రామస్వామి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నరసయ్యతో పాటు కలెక్టరేట్, డీఆర్డీఏ సిబ్బంది పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.