వైఎస్ ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం

వైఎస్ ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం

నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లామని జగ్గయ్యపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. గురువారం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో వైకాపా నేత తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

విజయవాడ రోడ్ లోని వైయస్సార్ విగ్రహానికి వైకాపా పార్టీ నాయకులు అభిమానులతో కలిసి పూలమాలవేసి తన్నీరు నాగేశ్వరరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన్నీరు మాట్లాడుతూ… ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన పార్టీ వైకాపా పార్టీ అన్నారు. రైతులు మహిళలు విద్యార్థులు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో అమలు చేసినట్లు వివరించారు. గ్రామ వార్డు సచివాలయాలు వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రజల గడప వద్దకు సంక్షేమ పాలన తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply