గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ : ఎమ్మెల్యే

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ : ఎమ్మెల్యే

తోట్లవల్లూరు – ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. ఆదివారం తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలెం గ్రామంలో రూ.74 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులలో భాగంగా సీసీ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గోతులమయంగా రహదారులు మారడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. కనీసం గ్రామీణ ప్రాంతాల రహదారులు కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారాయి అని తెలిపారు. పల్లె పండుగ పథకంలో లక్షలాది రూపాయలు వెచ్చించి సీసీ రహదారుల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.

కృష్ణాజిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, తోట్లవల్లూరు మండల పార్టీ అధ్యక్షుడు వీరపనేని శివరామ్, వారితోపాటు సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలెం గ్రామంలో కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

Leave a Reply