సుజనా ఫౌండేషన్ వైద్య సేవలు అభినందనీయం
సుజనా ఫౌండేషన్ వైద్య సేవలు అభినందనీయం
కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్
భవానిపురం, ఆంధ్రప్రభ : వైద్యం ఖరీదైన ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి, సుజనా ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు అందిస్తున్న వైద్య సేవలు అభినందనీయమని కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్ కొనియాడారు. ఆదివారం హెచ్ బి కాలనీలో నిర్వహించిన సుజనా ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరాన్ని కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ సందర్శించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎం ఎస్ బేగ్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి గొప్ప సేవా తత్పరుడన్నారు.

డెంటల్, కంటి పరీక్షలు ఆర్థోపెడిక్, ఈసీజీ, ఎక్స్ రే, 2డి ఎకో వంటి పరీక్షలు నిర్వహిస్తూ కార్పోరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించడం మంచి పరిణామమని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ సూచికలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలిపారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీకెండ్ లో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను పశ్చిమ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎం ఎస్ బేగ్ కోరారు…

ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన ఈ ఆరోగ్య శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ ,ఎక్స్ రే ,వంటి పరీక్షలు నిర్వహించారు.. జనరల్ మెడిసిన్, డెంటల్, కంటి పరీక్షలు వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న 120 మందికి నిపుణులైన వైద్యుల బృందం ప్రత్యేక శ్రద్ధతో చికిత్సలు అందించారు. అవసరమైన వారికి అక్కడికక్కడే ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు డాక్టర్ దిలీప్ (జనరల్ మెడిసిన్ )శంకర నేత్ర వైద్యాలయం డాక్టర్ వీర్ల అంకమ్మ, డాక్టర్ అశ్విత, టెక్నీషియన్స్, కూటమి నేతలు యేదుపాటి రామయ్య, దుర్బేసుల హుస్సేన్,పత్సవ మల్లికార్జున, తిరుపతి అనూష, బ్రహ్మారెడ్డి, ఎస్ డి అలీ, స్రవంతి, ప్రేమ, మొవ్వ విజయ, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు ఈ వైద్య శిబిరంలో తమ సేవలు అందించారు.
