డప్పు కళాకారుడు శ్రీనివాసుడు కళారత్న అవార్డుకు ఎంపిక

డప్పు కళాకారుడు శ్రీనివాసుడు కళారత్న అవార్డుకు ఎంపిక

ఘంటసాల – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామానికి చెందిన డప్పు కళాకారుడు శ్రీనివాసుడును కళారత్న అవార్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. గత 35 సంవత్సరాలుగా డప్పు కళాకారుడుగా సేవలం దిస్తున్న శ్రీనివాసుడును ఉగాది పురస్కారాల్లో భాగంగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉగాది పురస్కారాల కార్యక్రమంలో అవార్డుతోపాటు రూ.50 వేల నగదు, ప్రశంసాపత్రం శ్రీనివాసుడుకు అందించనున్నారు. చిట్టూర్పు గ్రామానికి చెందిన శ్రీనివాసుడుకు చిన్నప్పటి నుంచి కళలపై మక్కువ ఎక్కువ.

నాటకాలు వేస్తూనే డప్పు కళాకార డిగా గుర్తింపు పొందారు. గ్రామస్థాయి నుంచి దేశ విదేశాల్లో ప్రదర్శనలిస్తూ మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. భారతదేశం లోని వివిధ రాష్ట్రాలతోపాటు ఇతర దేశాలైన ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, మలేషియా వంటి దేశాల్లో అత్యుత్తమ ప్రదర్శనలిచ్చారు. ఇటలీ, చైనాలో జరిగిన ఫోక్ ఫెస్టివల్లో శ్రీనివాసుడు ఇచ్చిన ప్రదర్శనలకు అవార్డులు అందుకున్నారు. 2018లో ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఉగాది’ పురస్కారాన్ని అందుకున్నారు. మరలా 2026లో కళారత్న అవార్డుకు ఎంపిక చేయటం పట్ల శ్రీనివాసుడు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply