Urea | రైతులు యూరియా యాప్ ను వినియోగించుకోవాలి…

Urea | రైతులు యూరియా యాప్ ను వినియోగించుకోవాలి…
- శంకరపట్నం మండలం లో ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన ఏడిఏ..
- యూరియా కొరత లేదు….
- యాప్ ద్వారా యూరియా కొనుగోలు తప్పనిసరి…
- ఏ డి ఏ శ్రీధర్…
Urea | శంకరపట్నం, ఆంధ్రప్రభ : రైతులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా కొనుగోలు కోసం యాప్ ను తప్పకుండా వినియోగించుకొని యూరియా కోసం రైతుల సమాచారాన్ని నమోదు చేసుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు మోతాదు ప్రకారమే పంటలకు యూరియా వాడకాన్ని వినియోగించాలని ఏ డి ఏ మానకొండూర్ నరెడ్ల శ్రీధర్ రైతులకు సూచించారు.
ఈ రోజు కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలంలోని, కేశవపట్నం, రాజాపూర్ ,మొలంగూర్, కాచాపూర్ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేసి యూరియా నిలువలను నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ శ్రీధర్ మాట్లాడుతూ రైతులు పంటలకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు మోతాదు మేరకే యూరియా వినియోగించి అధిక దిగుబడును పొందాలని, రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతుకు సకాలంలో యూరియా అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వము యూరియా యాప్ ను ప్రవేశపెట్టి రైతులకు యూరియాను చేరువ చేసేందుకు కృషి చేస్తుందని, సాంకేతిక లోపాలతో కొన్ని ఇబ్బందులు ఉన్న మండలంలోని పలు పెటిలైజర్ షాపులలో యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు యూరియా కోసం ఎలాంటి దిగులు చెందకుండ, అవసరం మేరకే యూరియా కొనుగోలు చేసి పంటలకు ఉపయోగించాలన్నారు.
రైతులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా మొబైల్ యాప్ సాఫ్ట్వేర్ లో యూరియా కోసం తప్పకుండా తమ పేరును నమోదు చేసుకొని యూరియా దిగుమతి చేసుకోవాలని కోరారు. శంకరపట్నం మండలంలో ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేసి నిలువాలని నమోదు చేసుకున్నట్లు ఏడిఎస్ శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెర్టిలైజర్ షాప్ యజమానులు, ఏఈవోలు, తదితరులు ఉన్నారు.
