లూప్ లైన్‌కు 32 మంది ఇన్‌స్పెక్టర్లు.. ఐజీపీ కీలక ఉత్తర్వులు

  • రెండేళ్లు తప్పనిసరిగా లూప్ లైన్‌లో విధులు నిర్వహించాలి

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మల్టీ జోన్-1 పరిధిలో పనిచేస్తున్న పోలీసు ఇన్‌స్పెక్టర్లకు సంబంధించి ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గతంలో లూప్ లైన్‌లో విధులు నిర్వర్తించని ఇన్‌స్పెక్టర్లు తప్పనిసరిగా రెండేళ్లపాటు లూప్ లైన్‌లో పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు జోన్ పరిధిలో పనిచేస్తున్న 32 మంది ఇన్‌స్పెక్టర్లను గుర్తించి వారి జాబితాను విడుదల చేశారు. ఇప్పటివరకు లూప్ లైన్‌లో పనిచేయని అధికారులు వెంటనే అక్కడ విధుల్లో చేరాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దీంతో ప్రస్తుతం కీలక బాధ్యతల్లో ఉన్న పలువురు ఇన్‌స్పెక్టర్లు తమ ప్రస్తుత పోస్టులను వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. త్వరలో మల్టీ జోన్-1 పరిధిలో భారీ ఎత్తున బదిలీలు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. లూప్ లైన్‌లో తప్పనిసరిగా విధులు నిర్వర్తించాల్సిన ఇన్‌స్పెక్టర్ల జాబితాను కూడా ఐజీపీ కార్యాలయం విడుదల చేసింది. ఈ నిర్ణయం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.