Tollywood | నాగవంశీ నిర్ణయం వెనుక కారణం ఇదేనా..?

Tollywood | నాగవంశీ నిర్ణయం వెనుక కారణం ఇదేనా..?
- నైజాం డిస్ట్రిబ్యూషన్ అంటే దిల్ రాజే
- యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ షాకింగ్ మూవ్
- డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అన్నపూర్ణ స్టూడియోస్
- దిల్ రాజు – నాగవంశీ అనుబంధానికి బ్రేక్..?
- మైత్రీ మూవీ మేకర్స్ ఎఫెక్ట్.. మారుతున్న సమీకరణాలు
Tollywood | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ అంటే.. ముందుగా గుర్తొచ్చేది దిల్ రాజు. గత కొంతకాలంగా నైజాంలో సినిమా రిలీజ్ చేయాలంటే.. దిల్ రాజు ఎలా చెబితే అలా అన్నట్టుగా నడిచింది. ఆయన నిర్మించిన సినిమాలే కాకుండా.. వేరే నిర్మాతలు నిర్మించిన సినిమాలు (Movies) కూడా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేసే వారు. అయితే.. ఇప్పుడు దిల్ రాజుకు నైజాం ఏరియాలో గట్టి ఎదురుదెబ్బ తగిలే ఉందని ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తుంది. యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ దిల్ రాజుకు షాక్ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అసలు ఇండస్ట్రీలో ఏం జరగబోతుంది..?
Tollywood | డిస్టిబ్యూషన్ రంగంలోకి అన్నపూర్ణ స్టూడియోస్..
నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి.. టాలీవుడ్ కింగ్ నాగార్జున దిగబోతున్నారట. తన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ద్వారా ఈ బ్యానర్ లో నిర్మించిన సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసేవారు. అలాగే చిన్న సినిమాలు, వేరే భాషలో నిర్మించిన కొన్ని సినిమాలను ఈ సంస్థ ద్వారా రిలీజ్ (Release) చేసేవారు. అంతే తప్పితే.. రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలా చేయలేదు. అయితే.. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్.. సీరియస్ గా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ రంగంలోకి దిగితే.. వేరే నిర్మాతలు తమ సినిమాలను ఈ సంస్థ ద్వారానే రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం.

Tollywood | దిల్ రాజుతో మంచి అనుబంధం కానీ..
ముందుగా నిర్మాత నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వరుసగా సినిమాలు నిర్మిస్తుంటారు. ఆయన నిర్మించిన సినిమాలను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసేవారు. దిల్ రాజు, నాగవంశీ మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే.. ఇప్పుడు దిల్ రాజుకు స్వస్తి చెప్పి అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studious) తో చేతులు కలిపేందుకు రెడీ అయినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అన్నపూర్ణ స్టూడియోస్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో ఇంత సడన్ గా అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి రావాలి అనుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.

Tollywood | అసలు కారణం ఏంటి…?
ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ రంగంలోకి వచ్చింది. దీంతో నైజాం మార్కెట్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కొంత మంది నిర్మాతలు మైత్రీ వైపు మొగ్గు చూపగా, ఇప్పుడు నాగవంశీ కూడా పక్కకు తప్పుకోవడంతో దిల్ రాజు (Dil Raju) డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ కి పెద్ద దెబ్బ అని చెప్పచ్చు. అసలు ఏం జరిగింది..? ఇంత సడన్ గా కింగ్ నాగార్జున నైజాంలో డిస్ట్రిబ్యూషన్ రంగం పై సీరియస్ గా దృష్టి పెట్టడానికి కారణం ఏంటి..? అనేది తెలియనప్పటికీ.. ఈ మార్పు మాత్రం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. మరి.. ముందు ముందు ఏం జరగనుందో చూడాలి.

CLICK HERE TO READ ఇంట్రెస్టింగ్.. కమల్ స్క్రీన్ టైమ్ షాక్ ..?
