Belt shop | ప్రాణం తీసిన బెల్టు షాపు..

Belt shop | ప్రాణం తీసిన బెల్టు షాపు..
- మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ
- 33 కేవీ విద్యుత్ షాక్ కు గురై మృతి
Belt shop | ఆంధ్రప్రభ – ఇంద్రవెల్లి : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారుల నిర్లక్ష్యానికి బెల్టు షాపు నిర్వహకుడి విద్యుత్ షాక్ కు గురై మరణించిన ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ జమున నాయక్ తెల్పిన వివరాల ప్రకారం ఇటీవల ధనోర బి లో గ్రామస్తులు బెల్టు షాపును నిర్వహించకూడదని నిర్ణయించుకున్నారు. ఇదే అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన మదిరే. అక్షయ్ (30) ధనోర గ్రామ శివారు వ్యవసాయ పొలములో గత కొన్ని రోజులుగా బెల్టు షాపును నిర్వహిస్తునాడు.
బుధవారం సాయంత్రం గిరాకీ బాగా ఉంటద నే ఉద్దేశముతో బుధవారం మధ్యాహ్నం పొలంలో ఉన్న 11 కేవీ. లైనుకు దొంగ చాటున కుండీలు పెట్టి కరెంటు తీసుకోవాలనే ఉద్దేశముతో యత్నించగా అక్కడికక్కడే విద్యుత్ షాక్ కు గురై మరణించాడు. బెల్టు షాపుల నిర్వాహకులు ఎక్సైజ్ శాఖ కు నెల నెల మామూళ్లు ఇచ్చి దర్జాగా తమ అక్రమ దందాను కొనసాగిస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. వీరు మామూళ్ల మత్తుకు ఎవరైనా po హిర్యాదు చేస్తే తప్ప అటువైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ రోజు చనిపోయిన బెల్టు షాపు నిర్వాహకుడి కు భార్య కోమల్ తో పాటు ఇద్దరు పిల్లలు వీధిన పడ్డారు. అదే.ఎక్సైజ్ తో పాటు సంబంధిత శాఖ వారు బెల్టు షాపులను కట్టడి చేస్తే ఓ నిండు కుటుంబం బ్రతికేది. స్థానిక పోలీసులు శవ పంచనామా నిర్వహించారు. శవాన్ని పి. ఎం కోసం ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
