గోవులను దేశ మాతగా ప్రకటించాలి
బిక్కనూర్ మండల సన్మాన్ అభియాన్ కమిటీ సభ్యులు
బిక్కనూరు ఏప్రిల్ 27 ఆంధ్రప్రభ : గోవులను దేశమాతగా ప్రకటించాలని బిక్కనూర్ మండల సన్మాన్ అభియాన్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో గోవుల సంరక్షణ కోసం హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దారు సునీతకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గోవులను అక్రమంగా తరలిస్తూ వధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .గోవుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. దేవతగా పూజించే గోవులను చంపడం చట్టప్రకారం నేరమని చెప్పారు. వాటి రక్షణ కోసం తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో ప్రతినిధులు గొల్ల రమేష్, చల్ల లక్ష్మణ్ ,రవీందర్ రెడ్డి, తునికి వేణు, మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రమేష్, గజ్జ వేణు, సురేష్ గౌడ్, భరత్ కుమార్, పరమేష్, అరుణ్ తదితరులు ఉన్నారు.
