గొట్టుముక్కల ఫౌండేషన్ సేవలు కొనసాగాలి

గొట్టుముక్కల ఫౌండేషన్ సేవలు కొనసాగాలి
విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్.
ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి.
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా..
విజయవాడ సెంట్రల్, ఆంధ్రప్రభ : గొట్టుముక్కల ఫౌండేషన్ ద్వారా పేదలకు సేవలు అంధిస్తున్న కమిటీ నిర్వాహకులకు,మున్ముందు మరెన్నోసేవలు కొనసాగాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ అన్నారు. గొట్టుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య, కంటిపరీక్షలు ఆదివారం 30 డివిజన్ రామకృష్ణాపురం గ్రంథాలయం ప్రక్కన రామరాజు కన్వెన్షన్ ఏపీ బాక్వ బోర్డ్ చైర్మన్, గొట్టుముక్కల ఫౌండేషన్ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్,సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులు పాల్గొని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. న్యూరాలజీ, జనరల్ మెడిసిన్ సహా అన్ని విభాగాల వైద్యులు ఒకే వేదికపై, నాణ్యమైన వైద్య సేవలు అందించడం చాలా సంతోషం అని వారన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, నాగవంశం చైర్మన్ ఎర్రబోతు రమణారావు, ఆకుల సూర్యప్రకాష్, దాసరి కనకారావు, పోలవరం చరణ్ సాయి, లక్కం రాజు శ్రీనివాస్ రాజు, సుధీర్ వర్మ, బిమన ఆంజనేయులు, సాయి, రాజన్న బంగారు నాయుడు, బూదాల సురేష్, కంచెటి నాగరాజు, లక్కీశెట్టి సాయి తదితర నాయకులు పాల్గొన్నారు.
