విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే

విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే
గంపలగూడెం,మే 1(ఆంధ్రప్రభ):మండలంలోని కనుమూరు అత్తునూరు చెన్నారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ప్రజాపత్ లక్ష్మణ్ పదవ తరగతి ఫలితాలలో 585 మార్కులు సాధించి డివిజన్ స్థాయిలో ప్రథమ స్థానం నిలవడంతో నియోజకవర్గ శాసనసభ సభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు శుక్రవారం ఆ విద్యార్థిని శాలువాతో సత్కరించి అభినందించారు.అదేవిధంగా పాఠశాల స్థాయిలో ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులు పగడాల వర్షిత,రేగళ్ల సుహాసినిలను అభినందించారు. గ్రామానికి చెందిన రేగళ్ల బాలకోటిరెడ్డి ప్రథమ,ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 10000,5000 చొప్పున నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పివిడిఎల్ నరసింహారావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వాసిరెడ్డి నాగలక్ష్మి, స్థానిక సొసైటీ అధ్యక్షులు అత్తిరెడ్డి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
