52YRS | దంపతుల మధ్య గొడవ..

52YRS | దంపతుల మధ్య గొడవ..

52YRS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్​లోని మీర్‌పేట్ పీఎస్‌ పరిధిలో దారుణ హత్య చోటుచేసుకుంది. భార్యను కత్తితో నరికి చంపాడు భర్త. నల్గొండ జిల్లా శివన్నగూడెంకు చెందిన వసంత(52)ను భర్త నర్సింహ చంపాడు. దంపతుల మధ్య గొడవ జరగడంతో.. భార్యపై కత్తితో విచక్షణారహితంగా భర్త దాడి చేశాడు.

దీంతో వసంత అక్కడికక్కడే మృతిచెందాడు. మీర్‌పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడు నర్సింహ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Leave a Reply