5iplmatch | ఐపీఎల్‌లో రెండు మ్యాచులు
5iplmatch | ఐపీఎల్‌లో రెండు మ్యాచులు
5iplmatch | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఇవాళ ఆదివారం సెలవు రోజు కావడంతో ఐపీఎల్‌లో రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. చెన్నై వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ , లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుండగా.. రాయ్‌పూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున ఉన్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. నేటి మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు ఓడితే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటాయి.
ప్రస్తుతం 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో ఆర్‌సీబీ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తదుపరి నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలవాలి. ముంబై ఇండియన్స్‌పై గెలిస్తే ఆర్‌సీబీ ఆత్మవిశ్వాసం రెట్టింపు కానుంది. ఓడితే మాత్రం వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడి ఒత్తిడిలోకి కూరుకుపోనుంది. అప్పుడు మూడు మ్యాచ్‌లకు రెండు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టాప్-2 బెర్త్‌ను దక్కించుకోవాలంటే ఆర్‌సీబీకి ఈ విజయం కీలకం.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 6వ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి 4 మ్యాచ్‌ల్లో మూడు గెలవాలి. లక్నో చేతిలో గెలిస్తే సీఎస్‌కే పని ఈజీ అవుతుంది. అలా కాకుండా ఓడితే.. చివరి మూడు మ్యాచ్‌లకు మూడు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ, సీఎస్‌కే గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా.. లక్నో, ముంబై మాత్రం ప్రత్యర్థి జట్లకు షాక్ ఇవ్వాలనే కసితో ఉన్నాయి.
