నివాళులు..

నివాళులు..
బంటుమిల్లి – ఆంధ్రప్రభ : బంటుమిల్లి గ్రామంలో మాజీ టీటీడీ చైర్మన్, చీఫ్ విప్, మరియు మాజీ శాసనసభ్యులు కీ”శే” కాగిత వెంకట్రావు గారి పంచమ వర్ధంతి వేడుకల్లో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.
బంటుమిల్లి గ్రామంలో హీరో షోరూం దగ్గర కీ”శే” కాగిత వెంకట్రావు గారి పంచమ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి చలివేంద్రాన్ని ప్రారంభించరు..
అనంతరం బంటిమిల్లి లక్ష్మీపురం అంబేద్కర్ సెంటర్ వద్ద కీ”శే” కాగిత వెంకట్రావు గారి పంచమ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మజ్జిగ పంపిణీ చేసిన పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
