5.15 lakhs | మధ్యాహ్నం 2 గంటలకే…

5.15 lakhs | మధ్యాహ్నం 2 గంటలకే…

5.15 lakhs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు ఈనెల 29న (బుధవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.

మార్చి 14 నుంచి ప్రారంభమైన పదో తరగతి ప్రధాన పరీక్షలు ఈనెల 13న ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

పరీక్షల అనంతరం జవాబుపత్రాల మూల్యాంకనం వేగంగా చేపట్టిన అధికారులు ఈ నెల 23వ తేదీతో పూర్తిచేశారు. అనంతరం ఫలితాల తయారీ ప్రక్రియను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు. ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.