Sanatnagar | అదే కారణమా?

Sanatnagar | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన విషాద ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇవాళ తెల్లవారుజామున భరత్‌నగర్‌ వంతెన పక్కన శంకర్‌ (48) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేశారు. కర్ణాటకకు చెందిన శంకర్‌ రెండేళ్లుగా మూసాపేటలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply