అంగన్వాడి కేంద్రానికి పిల్లలు తప్పనిసరిగా రావాలి…

అంగన్వాడి కేంద్రానికి పిల్లలు తప్పనిసరిగా రావాలి…
వికారాబాద్, ఆంధ్రప్రభ : అంగన్వాడి కేంద్రానికి విద్యార్థులు తప్పనిసరిగా రావాలని ప్రతిరోజు ఉదయం పిల్లలకు అల్పాహారంతో పాటు మధ్యాహ్నం పౌష్టికాహారం అందించడం జరుగుతుందని రాజీవ్ గృహకల్ప అంగన్వాడి టీచర్ మనోహర తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజు గృహకల్ప అంగన్వాడి కేంద్రంలో విద్యార్థులకు సంబంధిత పుస్తకాలకు సంబంధించిన అంశాలను బోధించారు.
ఈ సందర్భంగా మనోహర మాట్లాడుతూ రాజీవ్ గృహకల్ప అంగన్వాడి కేంద్రాన్ని పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ముందు వరుసలో నిలపల అన్నది తమ అభిప్రాయమని అందుకని అనుకూలంగా అంగన్వాడి కేంద్రాన్ని తీర్చి దిద్దడం జరుగుతుందని తెలిపారు విద్యార్థులు తప్పనిసరిగా అంగన్వాడికేదానికి కావాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
గతంలో అంగన్వాడి కేంద్రాన్ని వికారాబాద్ సిడిపిఓ వెంకటేశ్వరి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని ఆమె తెలిపారు వికారాబాద్ జిల్లాలో రాజీవ్ గృహకల్పన అంగన్వాడి కేంద్రాన్ని ఆదర్శ అంగన్వాడి కేంద్రంగా రూపొందిస్తామని అన్నారు. అంగన్వాడి కేంద్రం నుంచి వచ్చి విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతృప్తిగా ఉన్నప్పుడే అంగన్వాడి కేంద్రం ముందుకు సాగుతుందని అన్నారు.
