చినుకు పడితే చిత్తడే…

చినుకు పడితే చిత్తడే…

రాధా నగర్ సచివాలయం.

పాయకాపురం, ఆంధ్రప్రభ : రాధా నగర్ ప్రాంతంలోని 268,269 సచివాలయం ఆవరణంలో చినుకు పడితే చిత్తడిగా మారింది.కొద్దిపాటి వర్షానికి సచివాలయంలో నీరు నిల్వ ఉండి, ప్రజలకు ఇబ్బందిగా మారింది.ప్రతి రోజు సచివాలయానికి వందల సంఖ్యలో ప్రజలు తమ అవసరతలు నిమిత్తం వస్తూ వుంటారు. నడవడానికి పొడి నేల లేక వర్షపు నీటిలో నడవాల్సిన పరిస్థితి నెలకొంది.మహిళలు తమ చీరలు వర్షపు నీటిలో తడిచి పాడైపోతున్నాయని వాపోతున్నారు.అసలు సచివాలయం సిబ్బంది ఈ పరిస్థితిపై నోరు మెదపలేకుండా ఉండటం చాలా బాధాకరమని పలువురు వాపోతున్నారు.

సచివాలయం ఆవరణలో అన్నీ రకాల వస్తువులు అక్కడ పడేస్తున్నారు.చెత్త చెదారాలు వేస్తున్నారు.సంబందిత అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో చినుకు పడి నీరు నిల్వ ఉన్నాయి. దీంతో ఆటగాళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంబందిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply