కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారు
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారు
గద్దె క్రాంతి కుమార్
పటమట, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగుతూ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నదని టీడీపీ యువ నాయకుడు గద్దె క్రాంతి కుమార్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ కోకాకోలా స్ట్రీట్‌లో గద్దె క్రాంతి కుమార్ పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు విరగడంతో ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ పడాల లక్ష్మణను ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. వైద్య ఖర్చులు నిమిత్తం రూ. 15 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. తదుపరి 16వ బూత్ లో జరుగుతున్న SIR ఓటర్ సర్వేను పరిశీలించారు.
ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలవుతున్నాయని, సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో రాష్ట్రంలో సానుకూల వాతావరణం నెలకొన్నదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. మహిళలు, యువత, రైతులు, పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం ముందంజలో ఉందని, అందుకే రెండేళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలని, వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావడం ప్రతి నాయకుడి బాధ్యత అని గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. పడాల లక్ష్మణ త్వరగా కోలుకుని తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పడాల గంగాధర్, పొనుగుమాటి మెహనరావు, సప్పా శ్రీను, కండుబోతు దుర్గారావు, గార్లపాటి గోపి, షేక్. షకీలా, మొకర రామారావు, రాచమళ్ళ రాము, పడాల వాసు తదితరులు ఉన్నారు.
