నాగన్నచెరువు గ్రామంలో ప్రజా దర్బార్

నాగన్నచెరువు గ్రామంలో ప్రజా దర్బార్

ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం సూచించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్

బంటుమిల్లి – ఆంధ్రప్రభ : బంటుమిల్లి మండలం నాగన్నచెరువు గ్రామంలో బుధవారం నాడు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ప్రజా దర్బారును సంబంధిత అధికారులతో కలిసి నిర్వహించారు.

ప్రజలు నేరుగా తమ వినతులు, సమస్యలు, అభ్యర్థనలను ఎమ్మెల్యే గారికి తెలియజేసి పరిష్కారం కోరగా, వెంటనే స్పందించిన కాగిత కృష్ణ ప్రసాద్ ప్రతి సమస్యను తక్షణమే నమోదు చేయించి, సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. ప్రజల ఇబ్బందులను వాయిదా వేయకుండా పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం లక్ష్యం ప్రజల వద్దకే పాలన చేరేలా చూడడమేనని, ఇకపై ప్రజలు ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడకుండా ప్రజా దర్బారుల ద్వారా పరిష్కారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అంచనాలను నెరవేర్చడంలో తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

ప్రజా దర్బారులో స్థానికులు తమ గృహ, విద్యుత్, రోడ్లు, పెన్షన్లు, వైద్య సేవలు వంటి వివిధ సమస్యలను వివరించారు. సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Leave a Reply