ఉపాధి హామీ కార్మికులకు ఐరిస్ హజరు రద్దు చేయాలి…

ఉపాధి హామీ కార్మికులకు ఐరిస్ హజరు రద్దు చేయాలి…

మొవ్వ – ఆంధ్రప్రభ : ఉపాధి హామీ చట్టంలో భాగంగా చేపడుతున్న పనులలో కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఐరిస్ హజరు విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణాజిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. పాత పద్దతిలో హాజరు విధానాన్ని పునరుద్ధరించాలని సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షులు శీలం నారాయణరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం ఉపాధి హామీ చట్టాన్ని పేదల నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది అని ఆ ప్రయత్నంలో భాగమే ఐరిస్ విధానం అమలు చేస్తుందన్నారు.

ఈ విధానం వల్ల ఉపాధి హామీ కార్మికుల హాజరు నమోదు కాకపోవడంతో వారు పనులకు వెళ్లినా నిరాశతో వెను తిరగాల్సి వస్తోందన్నారు. మండలంలో పెడసనగల్లు, అవిరిపూడి, భట్లపెనుమర్రు, ఇతర అనేక గ్రామాల్లో ఐరిస్ విధానం వల్ల హాజరు నమోదు కాకపోవడంతో పామర్రు ఇతర ప్రాంతాల లో ఉన్న మీ సేవా కేంద్రాల చుట్టూ కార్మికులు ఆధార్ కార్డులు పట్టుకొని అనేక వ్యయ ప్రయాసలకూ గురవుతు సరి చేసుకోవటం జరుగుతుంది.

ఇప్పటికే ఉపాధి అవకాశాలు వ్యవసాయ రంగంలో యంత్రాల ప్రవేశం వల్ల తగ్గడంతో పాటు వ్యవసాయ పనులు లభించక వందలాది వ్యవసాయ కార్మికులు జిల్లాలో వలసలు వెళ్లాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో దివిసీమ ప్రాంతం నుంచి వలసలు ఎక్కువగా ఉంటున్నాయని, రాష్ట్రం వ్యాప్తంగా గత రెండు నెలల్లో సుమారు 196 మంది కార్మికులు ప్రమాద కారణం మరణించడం జరిగింది ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం అన్యాయమని అన్నారు. ఐరిస్ విధానం కొనసాగితే జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ కార్మి కులతో కలిసి ఆందోళన చేపట్టివలసి ఉంటుందని తెలియజేసినారు.

Leave a Reply