మొక్కజొన్న రైతులను ఆదుకోండి..

మొక్కజొన్న రైతులను ఆదుకోండి..
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి..
క్వింటా 2400 రూపాయల మద్దతు ధర అమలు చేయండి.
రాష్ట్ర మంత్రి ఫరూక్ కు ,మొక్కజొన్న రైతుల వినతి…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా ను జిల్లాలోనూ ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలకు కొరియటంతో కొనుగోలు కేంద్రాలు లేకపోవడం జిల్లాలో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, రభి సీజన్లో వచ్చిన మొక్కజొన్న పంట కైనా మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ ను రైతు సంఘం నాయకులు మొక్కజొన్న రైతులు శనివారం కోరారు. మంత్రికి వినతిపత్రాన్ని అందజేశా రు.
ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. క్వింటాకు 2400 మద్దతు ధర అమలు జరపాలని డిమాండ్ చేశారు.రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా కార్యదర్శి రామచంద్రుడు, సహాయ కార్యదర్శి సురేష్ , కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్ మరియు వివిధ మండలాల రైతు నాయకులు బాల వెంకట్, రత్నమయ్య ,రాజు, రణధీర్ తో పాటు మండలాల మొక్కజొన్న రైతులు పాల్గొన్నరు.
గడిచిన ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలకు తోడు కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, మధ్య దళారుల దోపిడీ వల్ల జిల్లాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతాంగం తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలైనారన్నారు.ప్రస్తుత రబీ సీజన్లో సకాలంలో యూరియా దొరకక, అధిక ధరలకు విత్తనాలు, ఎరువులు , పురుగు మందులు కొని ఎకరాకు 40 వెల రూపాయలు వరకు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే ప్రస్తుతం మధ్య దళారులు సిండికేట్ గా మారి మొక్కజొన్నలు క్వింటాలు కేవలం 1600 రూపాయలకే కొనుగోలు చేయడం వల్ల కనీస పెట్టుబడి కూడా రాక తాము తీవ్రంగా నష్టపోతున్నామని, కౌలు రైతులు చెల్లించిన కౌలు కూడా దక్కక అప్పుల అప్పాలై తమకున్న కొద్దిపాటి ఇల్లు పొలాలు అమ్ముకునే దుస్థితి ఏర్పడిందని వాపోయారు.
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన క్వింటా 2400 రూపాయల మద్దతు ధర అమలు జరగకపోవడం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడమే అన్నారు. జిల్లాలోని మొక్కజొన్న పండించిన రైతులందరూ తీవ్రంగా నష్టపోతున్నారు. కావున మంత్రి వెంటనే జోక్యం చేసుకొని తమ సమస్యను ముఖ్యమంత్రి తో విన్నవించి వెంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించమని.
వారు కోరారు.మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని, త్వరలోనే జరుగు క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి జిల్లాలోని మొక్కజొన్న రైతాంగ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు. గడిచిన ఖరీఫ్ సీజన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేకపోయినదన్నారు.ఇప్పుడైనా రైతులకు న్యాయం జరిగేలా మంత్రిగారు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం నాయకులు కోరారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.
