16thplace | రాష్ట్రానికే ఆదర్శం
16thplace | రాష్ట్రానికే ఆదర్శం
16thplace | జల వనరుల సంరక్షణలో అన్నమయ్య జిల్లా ఆదర్శం
భూగర్భ జలాల పెరుగుదలతో రైతులకు ఊరట
విద్య, వైద్య రంగాల్లో గణనీయ పురోగతి
పారదర్శక పరిపాలనతో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు
16thplace | అన్నమయ్య, ఆంధ్రప్రభ బ్యూరో: అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఆయన పరిపాలనా దక్షత జిల్లాను అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేస్తోంది. ముఖ్యంగా జల వనరుల సంరక్షణలో చేపట్టిన చర్యలు రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచి, జిల్లా భూగర్భ జలాల స్థాయిని రాష్ట్రంలో 25వ స్థానం నుంచి రెండో స్థానానికి తీసుకువచ్చాయి. ఈ కృషిని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సులో ప్రత్యేకంగా ప్రశంసించడంతో పాటు- రాష్ట్ర భూగర్భ జలాల నోడల్ అధికారిగా నిశాంత్ కుమార్‌ను నియమించారు.
జలధార ప్రాజెక్ట్ ద్వారా చెరువుల పునరుద్ధరణ, పూడికతీత, వాగులు-కాలువల అనుసంధానం, వర్షపు నీటి నిల్వ వ్యవస్థలు అమలవడంతో భూగర్భ జలాల మట్టం గణనీయంగా పెరిగింది. దీని ప్రభావంతో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చి, ఎండిపోయిన బోర్లు మళ్లీ పనిచేయడం ప్రారంభించాయి. సాగుభూమి విస్తీర్ణం పెరిగి రైతులకు ఉపశమనం కలిగింది.గ్రామీణ రహదారుల అభివృద్ధి, తాగునీటి సమస్యలపై ముందస్తు ప్రణాళికలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థ అమలు జిల్లాలో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేశాయి. స్పందన, ప్రజావేదికల ద్వారా ప్రజల సమస్యలకు వేగంగా పరిష్కారాలు అందుతున్నాయి.విద్యా రంగంలోనూ జిల్లాకు గణనీయమైన పురోగతి కనిపిం చింది.
ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో అన్నమయ్య జిల్లా 85.88 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 16వ స్థానం సాధించింది. ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు మెరుగుపడటంతో ప్రజల్లో ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరిగింది.ఆరోగ్య సేవల పర్యవేక్షణ, తల్లి-శిశు సంక్షేమం, గ్రామీణ ఆరోగ్య శిబిరాలు, పోషణ కార్యక్రమాలకు ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా వైద్య రంగంలోనూ మెరుగుదల కనిపిస్తోంది.ప్రజాప్రతినిధులతో సమన్వయం, ఫీల్డ్ విజిట్లు-, పారదర్శక పరిపాలనతో నిశాంత్ కుమార్ జిల్లాను అభివృద్ధి మోడల్‌గా నిలబెడుతున్నారు. నీటి సంరక్షణ నుంచి విద్య, వ్యవ సాయం, సంక్షేమం వరకు పది సూత్రాలతో అన్నమయ్య జిల్లా ప్రగతిలో దూసుకుపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి పది సూత్రాల ప్రణాళికను తయారు చేసుకుని కలెక్టర్ల సదస్సుకు సంసిద్ధమవుతున్నారు.
CLICK HERE TO READ పశ్చిమను ప్రథమ స్థానంలో నిలిపేందుకు చర్యలు
