Tadipatri Politics | తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత..

Tadipatri Politics | తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత..

Tadipatri Politics | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం ఎదుట ఆందోళన చేపట్టేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధమవగా, పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ… కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానిచ్చేది లేదని హెచ్చరించారు. పెద్దారెడ్డికి పోలీసులు భద్రత కల్పించడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జేసీ, తాడిపత్రిలో శాంతిభద్రతల పేరుతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇరువర్గాల నేతల వ్యాఖ్యలతో తాడిపత్రిలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

Leave a Reply