IPL 2026 Final Fight | ఫైన‌ల్ ముఖాబ్లా ..

IPL 2026 Final Fight | ఫైన‌ల్ ముఖాబ్లా ..

  • ఫినాలే లో టాస్ గెలిచిన ఆర్సీబీ
  • రెండో ట్రోఫీ కోసం ట‌గ్ ఆఫ్ వార్
  • అటు కింగ్.. ఇటు ప్రిన్స్ !!
  • రెండో క‌ప్పు కొట్టేదెవ‌రు !!

అహ్మదాబాద్ : దాదాపు రెండు నెల‌ల పాటు క్రికెట్ అభిమానుల‌కు నాన్‌స్టాప్ వినోదాన్ని అందించిన ఐపీఎల్ 2026 ముగింపు ఘ‌ట్టానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈరోజు (మే 31) జరగబోయే హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), మాజీ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ (GT) హోరాహోరీగా తలపడుతున్నాయి.

కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన.. ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది . దీంతో సొంత గ్రౌండ్ లో గుజ‌రాత్ టైటాన్స్ ముందు గా బ్యాటింగ్ కు దిగ‌నుంది.

తుది జ‌ట్లు :

గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్ (సి), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (WK), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (c), కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (WK), రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్, జాకబ్ డఫీ

ఇదిలా ఉండగా, క్వాలిఫైయర్ 1లో గుజరాత్‌ను ఘోరంగా ఓడించి నేరుగా ఫైనల్ చేరిన రజత్ పటిదార్ నేతృత్వంలోని ఆర్‌సీబీ.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన (CSK, MI తర్వాత) మూడో జట్టుగా రికార్డు సృష్టించాలని భావిస్తోంది. మరోవైపు శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ తమ సొంత మైదానంలో ప్రతీకారం తీర్చుకుని రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.

గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు అహ్మదాబాద్ పిచ్‌పై తిరుగులేని రికార్డు ఉంది. అతని కెరీర్ బెస్ట్ టీ20 పరుగుల్లో దాదాపు 25% ఇక్కడే వచ్చాయి.. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్‌పై విధ్వంసకర సెంచరీ (104) చేసిన గిల్.. అదే ఫామ్‌ను ఫైనల్లోనూ కొనసాగించాలని చూస్తున్నాడు.

ఇక‌ ఈ సీజన్‌లో కోహ్లీ సరికొత్త అప్రోచ్‌తో కనిపిస్తున్నాడు. పవర్‌ప్లేలోనే భారీ స్ట్రైక్ రేట్‌తో చెలరేగి ఆడుతూ… జట్టుకు మెరుపు ఆరంభాలు ఇస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా నాలుగు సీజన్లలో 600+ పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించిన కోహ్లీ.. గుజరాత్ టీమ్‌పై ఎప్పుడూ 71.85 సగటుతో (Average) భారీ స్కోర్లు చేస్తుండటం ఆర్‌సీబీకి ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.

ఇటీవలే ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్ 1లో ఆర్‌సీబీ 254 పరుగుల భారీ స్కోరు చేసి గుజరాత్‌ను 92 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ రజత్ పటిదార్ కేవలం 33 బంతుల్లో 93(నాటౌట్)పరుగులతో విరుచుకుపడ్డాడు. ఆ అవమానానికి సొంత ప్రేక్షకుల ముందు బదులుతీర్చుకోవాలని గిల్ సేన కసితో ఉంది.

ఒకవైపు కింగ్ కోహ్లీ తనదైన శైలిలో పవర్‌ప్లే నుంచే మ్యాచ్‌ను శాసించాలని చూస్తుంటే, మరోవైపు అహ్మదాబాద్ పిచ్‌పై తిరుగులేని రికార్డు ఉన్న ప్రిన్స్ గిల్ తన హోమ్ గ్రౌండ్‌లో సింహాసనాన్ని దక్కించుకోవాలని కసితో ఉన్నాడు. ఈ ఇద్దరిలో ఈరోజు మైదానాన్ని ఎవరు ఏలుతారో చూడాలి.

IPL 2026 ప‌ర్పుల్ క్యాప్ కోసం ట‌ఫ్ ఫైట్ !