Arjun Ram Meghwal | ఆ రిజర్వేషన్ అమలు సమయం ఆసన్నమైంది

Arjun Ram Meghwal | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : లోక్‌సభ స్థానాల పెంపుతో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే మహిళలకు గణనీయమైన ప్రాతినిథ్యం లభిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే, మహిళలకు మొత్తం 272 సీట్లు లభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్న ఆయన, ఇది దేశ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. కొన్ని బిల్లులు తరం తరాలకు స్ఫూర్తినిస్తాయని, మహిళా రిజర్వేషన్ కూడా అలాంటి చారిత్రాత్మక నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందని అర్జున్‌రామ్ మేఘవాల్ అభిప్రాయపడ్డారు.
