74.1percent | పశ్చిమను ప్రథమ స్థానంలో నిలిపేందుకు చర్యలు

74.1percent | పశ్చిమను ప్రథమ స్థానంలో నిలిపేందుకు చర్యలు
74.1percent | రాష్ట్రంలో ప్రథమ స్థానంలో పశ్చిమగోదావరి
కలెక్టర్ చదలవాడ నాగరాణికి ముఖ్యమంత్రి ప్రశంసలు
టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
డ్రోన్ల వినియోగంలో సరికొత్త విధానాలు
74.1percent | భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: వ్యవసాయ ప్రధానమైన పశ్చిమగోదావరి జిల్లా నేడు ఆక్వా రంగంలోనూ వేగంగా దూసుకుపోతుంది. పారిశ్రామికంగా అడుగులు వేగవంతమయ్యాయి. మరోవైపు టూరిజం అభివృద్ధి పైన దృష్టి పెట్టారు. అన్ని రంగాల్లో పశ్చిమగోదావరి జిల్లాలో మొదటి స్థానంలో నిలిపేలా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. దీని ఫలితంగానే పలు రంగాల్లో పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపారు.
రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మకమైన రెడ్ క్రాస్ గవర్నర్ అవార్డును కూడా జిల్లా కలెక్టర్ గత రెండేళ్లుగా అందుకుంటున్నారు. ప్రజల సానుకూల అభిప్రాయం 74.1 శాతంతో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపారు. ఈ ఏడాది మార్చి నెలలో అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూడా కలెక్టర్ చదరవాడ నాగరాణి ముఖ్యమంత్రిచే ప్రశంసలు అందుకున్నారు.
ముఖ్యంగా అన్నా క్యాంటీన్ల నిర్వహణ, ఏపీఎస్‌ఆర్టీసీ సర్వీసుల మెరుగుదల, మ#హళలపై నేరాల నియంత్రణ చర్యలు, దీపం 2 పథకం అమలు, ఎఫ్ లైన్ సేవలు, విద్యుత్ సరఫరా సేవల వంటివి మెరుగయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో టూరిజం అభివృద్ధిపై గత కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు.
పిల్లలు టూరిజం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. జిల్లాలో ప్రభుత్వ భూములు కొరత ఉండడంతో జిల్లాలోని రెండు ప్రదేశాల్లో ఆర్ అండ్ బి స్థలాలను గుర్తించి పర్యాటకం అభివృద్ధిలో భాగంగా హోటల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలను టూరిజం అండ్ కల్చర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జెన్‌కు ప్రతిపాదనలను పంపించారు. పశ్చిమగోదావరి జిల్లాలో డ్రోన్లను సరికొత్త పద్ధతిలో వినియోగిస్తున్నారు.
