పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు…

పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు…

చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని పశువులకు 3 నెలలు పై పడిన దూడలకు, ఆవులు, గేదెలకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు మంగళవారం మండల కేంద్రంలో ప్రారంభించారు. కార్యక్రమాన్ని చిట్యాల గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మి, వార్డు మెంబర్ తౌటం నవీన్ చే పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ టీకాలు మండల పశువుల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కోరారు.

చిట్యాల ప్రాంతీయ పశువైద్య శాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి వెంకన్న మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పశువులకు వేయడం వలన వ్యాధి నుంచి రక్షించుకోవడమే కాకుండా పశువులు ఆరోగ్యంగా ఉండి పాల దిగుబడి పెరుగుతుంద అన్నారు. చిట్యాల మండల పశు వైద్య అధికారి డాక్టర్ అజయ్అప్పని ,మాట్లాడుతూ మండలంలోని 135 పశువులకు టీకాలు వేసినట్లు పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాలల్లో ఈ నెల 10 నుంచి ఏప్రిల్ 9 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

మండలంలోని అన్ని గ్రామాలలోని పశువుల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వైద్య శిబిరంలో, పశు వైద్య సహాయ సిబ్బంది కవిత, దివ్య, కరుణాకర్, రాజేందర్ రెడ్డి, లక్ష్మణ్ , రైతులు లాండే శివాజీ ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply