Funds | కేంద్ర మంత్రులకు మంత్రి పొన్నం లేఖ

Funds | కేంద్ర మంత్రులకు మంత్రి పొన్నం లేఖ
Funds | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పొన్నం ప్రభాకర్ లేఖలో కోరారు.
కేంద్రం నుంచి వచ్చే నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు అన్నారు. పన్నులు చెల్లిస్తున్నప్పుడు ప్రజల అభివృద్ధికి ఎందుకు చర్యలు చేపట్టట్లేదని పొన్నం లేఖలో పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై బండి సంజయ్, కిషన్‌రెడ్డి బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలన్నారు. తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లు విస్మరించడం తగదన్నారు. కేంద్ర ప్రయోజత పథకాల్లో కేంద్ర వాటా 90శాతం ఉండే విధంగా పునరుద్ధరించాలని మంత్రి పొన్నం లేఖలో కేంద్ర మంత్రులను కోరారు.
