మైనర్ల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు,

మైనర్ల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు,

పోలీసుల అదుపులో 11 ద్విచక్ర వాహనాలు,

చిట్యాల, ఆంధ్రప్రభ : ​రోడ్డు భద్రతా నిబంధనల పట్ల అవగాహన కల్పించే అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా చిట్యాల ఎస్సై పోచంపల్లి సతీష్ ,మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న 11 మంది మైనర్లను గుర్తించి, వారి వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ​తల్లిదండ్రులకు కౌన్సిలింగ్… ​వాహనాలతో పట్టుబడ్డ మైనర్ల తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి ఎస్.ఐ. ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేశారు.

అనంతరం ఎస్సై మాట్లాడుతూ చిన్న వయస్సులో వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు చిన్నారులకే కాకుండా, తోటి ప్రయాణికులకు ప్రమాదం ఉంచి ఉందని హెచ్చరించారు. ఇకపై ఎవరైనా మైనర్లకు వాహనాలు ఇస్తే, వాహన యజమానులపై తల్లిదండ్రులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు .​

18 ఏళ్ల లోపు వారు వాహనాలు నడపడం నేరం అన్నారు. వాహనానికి సంబంధించినఇన్సూరెన్స్ ,ఇతర డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవా లని, ​హెల్మెట్ ధరించాలని,ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. ఒకే వాహనంపై ముగ్గురు ప్రయాణించడం చట్టరీత్యా నేరం, దీనిపై నిరంతర నిఘా ఉంటుందన్నారు.​ఈ కార్యక్రమంలో చిట్యాల సెకండ్ ఎస్ఐ హేమ లత ఏఎస్ఐ సమిరెడ్డి , హెడ్ కానిస్టేబుల్స్ చంద్రమౌళి రామకృష్ణ, కానిస్టేబుల్స్ రంజిత్, లాల్ సింగ్ ,వాహనదారుల కుటుం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply