పచ్చదనం పెంపు ప్రతి ఒక్కరి బాధ్యత
పచ్చదనం పెంపు ప్రతి ఒక్కరి బాధ్యత
- ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, ఆంధ్రప్రభ ; పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటడంపరిరక్షణకు, భావితరాలకు మంచి వాతావరణం కల్పించడంప్రతి ఒక్కరి బాధ్యతని ప్రభుత్వ విప్ నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారునల్లగొండ జిల్లా నకరికల్లు నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీలో శుక్రవారం నాడు
ప్రపంచ పర్యావరణ దినోత్సవం చిట్యాల బస్టాండ్ వద్ద ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశంమొక్కలు నాటి వాటికి నీరు పోశారు.
అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు అందరూ ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ పందిరి గీతా రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన లక్ష్మి సైదులు, కమిషనర్ గురు లింగం లి, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్లు,కోఆప్షన్ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
