MLAs | ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్‌లు…

MLAs | ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్‌లు…

MLAs | చిట్యాల, ఆంధ్రప్రభ : తమ మీద నమ్మకం ఉంచి ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చి పోటీ చేయించి తమ గెలుపుకు బాటలు వేసిన నకిరేకల్ శాసనసభ్యులు(MLAs) వేముల వీరేశంకు జీవితాంతం రుణపడి ఉంటామని పెద్ద కాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం, చిన్న కాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్ తెలిపారు.

ఈ రోజు ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham)కు ఇరువురు సర్పంచులు శాలువ తో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎమ్మెల్యే సహకారంతో తమ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. తమ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.