KTR | ఈ నెల 20న ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌

KTR | ఈ నెల 20న ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌

KTR | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌రావు ఇవాళ జగిత్యాల పర్యటనకు బయల్దేరారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఈ నెల 20న జగిత్యాలలో ‘ప్రజా ఆశీర్వాద సభ’ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లను కేటీఆర్‌, హరీష్‌రావు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ కీలక నాయకులతో సమావేశమై, సభ నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాలలో కేటీఆర్, హరీష్‌రావు ఇద్దరూ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో సభకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

Leave a Reply