Police Commissioner | కేక్ కటింగ్.. ఆత్మీయ పలకరింపు

Police Commissioner | కేక్ కటింగ్.. ఆత్మీయ పలకరింపు
- మానసిక వికాస కేంద్రం పిల్లలతో న్యూ ఇయర్ సంబరాలు
- పిల్లల ఆనందాన్ని పంచుకున్న నగర పోలీస్ కమిషనర్
- పోలీస్ కార్యాలయంలో వెల్లివిరిసిన మానవీయత
Police Commissioner | విజయవాడ క్రైమ్, ఆంధ్రప్రభ : నూతన సంవత్సరం అంటే సంబరాలు, కేక్‌లు, శుభాకాంక్షలు మాత్రమే కాదు. కొంతమందికి అది ఆత్మీయ స్పర్శ, మానవీయ అనుభూతి కూడా. అలాంటి అనుభూతిని 2026 తొలి రోజుల్లోనే మానసిక వికాస కేంద్రం పిల్లలకు అందించారు నగర పోలీస్ కమిషనర్ ఎస్‌వి రాజశేఖర బాబు.

కమిషనర్ కార్యాలయం శనివారం అధికారిక వాతావరణాన్ని వదిలి, పిల్లల నవ్వులతో, చప్పట్లతో, అమాయక ఆనందంతో నిండిపోయింది. పిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన కమిషనర్, వారితో సరదాగా మాట్లాడుతూ వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించారు. చిన్న చిన్న మాటలు, స్నేహపూర్వక ఆత్మీయత ఆ క్షణాల్లో పోలీస్ అధికారి కాదు, ఒక పెద్ద మనసున్న మిత్రుడిగా మారిపోయారు. చివరగా పిల్లలకు చాక్లెట్లు అందిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
