WORLD | ట్రంప్ కీలక ప్రకటన…

WORLD | ట్రంప్ కీలక ప్రకటన…
WORLD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఐదు రోజుల పాటు ఇరాన్ పై దాడులకు బ్రేక్ వేస్తున్నామన్నారు. రెండు రోజులుగా ఇరాన్ తో చర్చలు జరుగుతున్నాయన్నారు.
ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేసిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. యుద్ధ భయం కమ్ముకున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకస్మిక నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా ముందడుగు వేస్తూ, ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక విరామం ప్రకటించడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఇదే సమయంలో ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించడం పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఇరాన్ తో మరో వారం రోజుల పాటు చర్చలు కొనసాగుతాయన్నారు.
